మరకలు తొలగించడం ఎలా?
1. రక్తపు మరకలు :-
మరకలు అయిన ప్రదేశాన్ని వెనిగర్ లో ముంచి 15 నిమిషాలు నానబెట్టాలి. తరువాత చల్లని నీళ్ళలో జాడించాలి. అవసరమైతే పై ప్రక్రియ మరొకసారి చేయాలి. తరువాత వెంటనే ఉతికి అరవేయవలెను.సాధ్యమైనంతవరకు మరక అయిన తరువాత ఎంత త్వరగా అయితే అంత త్వరగా ఉతకడం మంచిది. ఎందుకంటే మరక ఒకసారి ఎండిన తరువాత తొలగించడం కష్టం అవుతుంది.
2. కాఫీ మరకలు:-
మరకలు అయిన వెంటనే పొడిగుడ్డతో తుడవాలి. తరువాత మరక పడిన వెనుక వైపు కుళాయి క్రింద ఉంచి కడగవలెను. వెనుక వైపు నుండి కడగడం వలన మరక ప్రక్కలకు విస్తరించకుండా ఉంటుంది.